- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-US agreement: అందుబాటులోకి భారత ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ల మార్కెట్
ఎన్నో చర్చల తర్వాత భారత్, అమెరికాల మధ్య చరిత్రాత్మక ఆగ్రిమెంట్ జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ముసాయిదాను అమెరికా ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో చర్చల తర్వాత భారత్, అమెరికాల మధ్య చారిత్రాత్మక ట్రేడ్ ఆగ్రిమెంట్ (Historic trade agreement) జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ముసాయిదాను అమెరికా ప్రభుత్వం (US government) ఈ రోజు విడుదల చేసింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్- అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Trade agreement) దేశ ఆర్థిక రంగానికి కొత్త దిశను చూపబోతోంది. కాగా ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు ఏకంగా 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Union Minister Piyush Goyal) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం 'X' వేదికగా స్పందిస్తూ.. ఈ నిర్ణయం వల్ల దేశంలో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని, ముఖ్యంగా మహిళలు, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించారు.
ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా తన దేశంలోకి వచ్చే భారతీయ వస్తువులపై సుంకాలను (Tariffs) భారీగా తగ్గించి, 18 శాతానికి పరిమితం చేసింది. దీనివల్ల టెక్స్‌టైల్స్, దుస్తులు, చర్మ ఉత్పత్తులు (Leather), పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్ వంటి రంగాలకు భారీ లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా, జెనరిక్ మందులు (Pharmaceuticals), రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలపై సుంకాలను సున్నాకి (Zero Tariffs) తగ్గించడం విశేషం. ఇది 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి పెద్ద ఊతాన్నిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ భారీ ఒప్పందంలో భారత రైతుల ప్రయోజనాలను (Benefits of Indian farmers) ప్రభుత్వం పూర్తిగా కాపాడింది. సున్నితమైన వ్యవసాయ పాడి ఉత్పత్తులైన మొక్కజొన్న, గోధుమ, వరి, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్ వంటి వాటిని ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. అంటే, అమెరికా నుండి వచ్చే ఈ ఉత్పత్తులకు ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా దేశీయ రైతుల జీవనోపాధిని రక్షించినట్లు గోయల్ స్పష్టం చేశారు. MSMEలు, రైతులు, మత్స్యకారులకు ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద మార్కెట్ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






