ప్రమాద బాధితులకు అండగా నిలిచిన హైవే పెట్రోలింగ్ పోలీసులు

by Jakkula.Mamatha |

మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు హైవే పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ప్రమాద బాధితులకు అండగా నిలిచిన హైవే పెట్రోలింగ్ పోలీసులు
X

దిశ, కోదాడ: మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు హైవే పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం వినీత, మధు అనే యువతి యువకుడు బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి స్కిడ్ అయి రోడ్డుపై పడిపోవడంతో గాయాలపాలయ్యారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే పెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. గాయాలతో బాధపడుతున్న యువకులను పరిశీలించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అయితే అంబులెన్స్ చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో బాధితుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తన వాహనంలోనే వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితులకు వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితులకు అండగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ రామానంద ను స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు అభినందించారు. పోలీసుల సేవాభావం, మానవీయ దృక్పథానికి ఇది నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.

Next Story