- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో హై వోల్టేజ్ రాజకీయం.. గవర్నర్ సంచలన నిర్ణయం
కర్నాటక పాలిటిక్స్‌లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక పాలిటిక్స్ (Karnataka Politics)లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంప్రదాయబద్ధంగా చేయాల్సిన ప్రారంభోపన్యాసం చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ (Governor Thawar Chand Gehlot) నిరాకరించడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం మొదటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే రేపు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రసంగం చేసేందుకు గవర్నర్ విముఖత చూపినట్లుగా సమాచారం. ప్రభుత్వం పంపిన ప్రసంగ పాఠంలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉండటం, కేంద్రంపై విమర్శలు తలెత్తేలా కొన్ని గణాంకాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని లోక్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో ప్రభుత్వం పంపిన ప్రశంసల ప్రసంగాన్ని చదవడానికి గవర్నర్ ఒప్పుకోనట్లుగా తెలుస్తోంది.
కాగా, గవర్నర్ స్పీచ్ లేకుండా సభను ప్రారంభించడం రాజ్యాంగంలోని ఆర్టికల్-176 (Artical -176)ను ఉల్లంఘించడమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సీఎం ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని, గవర్నర్ తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ.. రేపు కర్ణాటక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తారా.. లేదా అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.






