- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తాడ్వాయి: తాడ్వాయి మండలంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పాత బస్టాండ్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి, బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడ కనిపించినా పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గుమిగూడే ప్రయత్నం చేసినా వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో "ఇక ఏం జరుగుతుందా?" అన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు తాడ్వాయి మండలానికే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పోలీసుల గుప్పిట్లో తాడ్వాయి..
ప్రస్తుతం తాడ్వాయి మండలం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భారీగా మోహరించిన పోలీసు బలగాలే దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాలపై జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ధర్నా పిలుపు నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న కఠిన చర్యలు ఎటువైపు దారితీస్తాయన్న ఉత్కంఠ ఇరు వర్గాల్లో నెలకొంది.






