- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD మెట్రోపై రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలు: కేటీఆర్
రూ. 30 వేల కోట్ల మెట్రో భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని కేటీఆర్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని, కిషన్ రెడ్డి ఇచ్చినట్టు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రూ. 30 వేల కోట్ల మెట్రో రైలు ఆస్తులపైన రేవంత్ రెడ్డి కన్ను పడిందని మెట్రోఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుట్రకు రేవంత్ రెడ్డి తెరలేపారని అందుకే మెట్రో రైలు ఎల్ అండ్ టి అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారన్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్.. రూ.14,000 కోట్ల ఎల్ అండ్ టి అప్పును రాష్ట్ర ప్రజలపై రేవంత్ రెడ్డి రుద్దుతున్నారని, హైదరాబాద్ మెట్రో పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు బీజేపీ ఎందుకు ఆమోదం తెలుపలేదని ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో మీరే చూస్తారు?:
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ప్రజల దృష్టి ఆకర్షించే విఫల ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు చేసిన రేవంత్ రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. మొదటి దశ మెట్రోను పూర్తి చేసిందే కేటీఆర్ అని మళ్లీ రెండో దశ మెట్రో పట్టాలెక్కాలంటే తిరిగి కేసీఆర్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. రేవంత్ రెడ్డికి తుగ్లక్, హిట్లర్ ఆదర్శం అని రాబోయే రోజుల్లో మెట్రో భూములను రేవంత్ రెడ్డి ఎలా అమ్ముతారు ఎవరు కొంటారో అంతా చూస్తారన్నారు.






