విజయవాడ సివిల్ కోర్టులో హై టెన్షన్.. లిఫ్ట్‌లో చిక్కుకున్న 8 మంది లాయర్లు..

by Malleboina Mahesh |   (  Updated:2026-04-23 06:46:25  IST  )

విజయవాడ సివిల్ కోర్టులో 8వ అంతస్తులో లిఫ్ట్ ఆగిపోవడంతో 8 మంది న్యాయవాదులు చిక్కుకున్నారు. SDRF సిబ్బంది పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

విజయవాడ సివిల్ కోర్టులో హై టెన్షన్.. లిఫ్ట్‌లో చిక్కుకున్న 8 మంది లాయర్లు..
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సివిల్ కోర్టు (Vijayawada Civil Court)లో గురువారం హై టెన్షన్ నెలకొంది. కోర్టు భవనంలోని లిఫ్టులో సాంకేతిక లోపం తలెత్తడంతో అది ఎనిమిదవ అంతస్తులో అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఈ సమయంలో లిఫ్టులో ఒక గర్భిణీ తో సహా మొత్తం ఎనిమిది మంది న్యాయవాదులు ఉన్నారు. లిఫ్ట్ డోర్ పూర్తిగా స్ట్రక్ అయిపోవడంతో వారు సుమారు గంటన్నర కాలంగా లోపలే చిక్కుకుపోయారు. లోపల గాలి ఆడకపోవడంతో న్యాయవాదులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా గర్భిణీ మహిళా న్యాయవాది ఊపిరాడక ఇబ్బంది పడటం తో తోటి న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం), ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. లిఫ్ట్ లోపల ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో, సిబ్బంది పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ను పంపిస్తూ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారు. ప్రస్తుతం లిఫ్ట్ డోర్లను తెరిచేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన కలకలం రేపగా, భవన నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై తోటి న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story