- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామ చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి ఇచ్చిన స్పీచ్ కాపీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి VB G RAM G బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ (Karnataka Assembly) సమావేశాల్లో హైడ్రామ చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో (budget meetings) భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ (Governor Thawar Chand Gehlot) కి ఇచ్చిన స్పీచ్ కాపీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి VB G RAM G బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వివాదాస్పద పేరాలను తొలగించాలని గవర్నర్ కోరగా, కేబినెట్ ఆమోదించిన స్పీచ్‌లో మార్పులు చేసేది లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం (Siddaramaiah Govt) స్పష్టం చేసింది. దీంతో గవర్నర్ ముందుగానే తారు అసెంబ్లీలో ప్రసంగించనని తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి నిన్న రాత్రి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్.కె. పాటిల్ బృందం లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఈ రోజు సభకు వచ్చి.. చూసినప్పటికి తాను అభ్యంతరం తెలిపిన 11 పేరాలను అలాగే ఉంచారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ సభలో ప్రసంగించకుండానే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ-జేడీఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందా అనే చర్చ మొదలైంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో కూడా ఇటీవల గవర్నర్ ప్రసంగాల విషయంలో ఇలాంటి హైడ్రామాలు చోటు చేసుకోవడం గమనార్హం.






