- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. బాగేపల్లి నియోజకవర్గం ఎన్నిక రద్దు!
బీజేపీ పిటిషన్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు గల్లంతైంది. ఆస్తుల వెల్లడిలో ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించి కర్ణాటకలో బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఎన్నికను హైకోర్టు కొట్టివేసింది.

దిశ, వెబ్ డెస్క్: నామినేషన్ అఫిడవిట్ లో తప్పుడు సమాచారం చూపినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) షాక్ ఇచ్చింది. చిక్కబల్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం (Bagepalli Constituency) నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎన్. సుబ్బారెడ్డి ఎన్నికను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. నామినేషన్ సమయంలో ఆయన తన పూర్తి ఆస్తులను ప్రకటించలేదని, అలాగే తనపై ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచారని బీజేపీ అభ్యర్థి మునిరాజు 2023 జూన్ 24న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆస్తుల వెల్లడిలో ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించి సుబ్బారెడ్డి (Subbareddy) ఎమ్మెల్యే సీటును రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆస్తుల ప్రకటనలో పారదర్శకత పాటించనందుకు సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో, సదరు నియోజకవర్గంలో తిరిగి ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఉంటుందని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తీర్పుతో బాగేపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.






