- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు అసహనం
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంపై హైకోర్టు మరసారి అసహనం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంపై హైకోర్టు(Telangana High Court) మరసారి అసహనం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ(Sigachi Pharma Company) ప్రమాదంలో మృతిచెందిన 56 మందికి, ఆచూకీ లభించని 8 మందికి, 28 మంది క్షతగాత్రులకు పరిహారం అందించడంతో పాటు, దర్యాప్తు కోసం ప్రత్యేక SIT ఏర్పాటు చేయాలని హైకోర్టులో బాబురావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు, ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అంటూ మండిపడింది. పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై కంపెనీ వివరణ ఇవ్వాలని, దానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు, చట్టప్రకారం అందాల్సిన పరిహారం వివరాలను సమర్పించాలని ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది.






