- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తులు
నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీ దేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్ లకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీ దేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకుని, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి జీవీఎన్.భరత లక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు హైకోర్టు జడ్జీలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, సీ.పీ, అదనపు కలెక్టర్ తదితరులతో హైకోర్టు న్యాయమూర్తులు అతిథి గృహంలో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు.






