- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ భేటీ: భవిష్యత్ వ్యూహాలపై కీలక చర్చ!
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక భేటీ జరగనుంది. ఈ నెల 19న రాహుల్, ఖర్గేలతో సీఎం రేవంత్మం త్రులు, సీనియర్ నేతలు సమావేశమవ్వనుండగా.. భవిష్యత్ వ్యూహాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress party) మంచి ఫలితాలను సాధించడమే కాకుండా రాజకీయ చతురతతో అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలను ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సారథ్యంలో ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన మెజారిటీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం ఈ భేటీ ద్వారా లభించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు తెలంగాణ నేతలతో చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీ పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






