వృద్ధుడిపైకి ఎక్కించిన కారు.. స్టార్ హీరో డ్రైవర్ అరెస్ట్

by Dishafeatures2 |
వృద్ధుడిపైకి ఎక్కించిన కారు.. స్టార్ హీరో డ్రైవర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: 58 ఏళ్ల వ్యక్తిని ఓ కారు తొక్కుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇన్నోవా కారు రోడ్డు మధ్యలో ఉన్న వికలాంగ వృద్ధుడిని తొక్కేసింది. చెన్నైలోని ఓ బిజీ రోడ్‌పై వికలాంగ వృద్ధుడు ఉన్నాడు. అదే సమయంలో కారు అతడి గుద్దుకుంటూ పోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కారు తమిళ హీరో శింబు, అతడి తండ్రికి చెందినది, ఘటన సమయంలో శింబు తండ్రి టీ రాజేందర్ కారులోనే ఉన్నారని సమాచారం అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా శింబు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పారు.



Next Story

Most Viewed