- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో పవన్ తాతాకు మంచి టాలెంట్ ఉంది: నందు
పవన్ తాతా, చమిందా వర్మ జంటగా నటించిన చిత్రం ‘హ్రీం’. శివమ్ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పించగా శివమల్లాల నిర్మించారు.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ తాతా, చమిందా వర్మ జంటగా నటించిన చిత్రం ‘హ్రీం’. శివమ్ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పించగా శివమల్లాల నిర్మించారు. రాజేష్ రావూరి ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం చిత్ర హీరో పవన్ తాతా జన్మదినం సందర్భంగా చిత్ర కార్యాలయంలో జరిగిన బర్త్‌డే వేడుకల్లో దండోరా చిత్ర హీరో నందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే ‘హ్రీం’ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ చూశాను. చూడగానే నన్ను ఎంతో ఎక్సైట్ చేసిన కంటెంట్ ఇది అనిపించింది. త్వరలోనే మీ అందరూ కూడా ఈ కంటెంట్‌ను చూస్తారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా మా ట్రావెల్ కొనసాగుతుంది. నాకు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సందేహాలు ఉంటే నేను ఏమి ఆలోచించకుండా శివమల్లాల అన్నతో షేర్ చేసుకుంటాను. ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆయన వెల్ విషర్. ఈ సినిమాతో తమ కెరియర్‌లను గొప్పగా ప్లాన్ చేసుకుంటున్న హీరో పవన్ తాతాకు, హీరోయిన్ డాక్టర్ చమిందా వర్మలకు నా కృతజ్ఙతలు’ అని నందు తెలియజేశారు.
హీరో పవన్ మాట్లాడుతూ.. ‘‘ఈ బర్త్‌డే నాకు ఎంతో ప్రత్యేకం. నాకు ‘హ్రీం’ సినిమా ద్వారా మంచి అవకాశం అభించింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ వేడుకలో నా కుటుంబ సభ్యులు మా మేనత్త రేణుకమ్మ, గోపి, రేఖ అందరూ పాల్గొనటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ చూసిన తర్వాత మీ అందరూ కూడా నన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ జన్మదిన వేడకల్లో సుజాత మల్లాల, శైలజా పద్మరాజు, దర్శకుడు రాజేష్ రావూరి, దర్శకుడు కృష్ణ కాంత్, వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్ రాజ్‌పవన్ కొమ్మోజు, ఎడిటర్ డిఐ కలరిస్ట్ వైఎస్‌ఎస్ శివప్రకాష్, నిర్మాత శ్రీనివాస్ బొప్పన, ఐయస్ రాజు, నిర్మాత ముని శివ తదితరులు పాల్గొన్నారు.






