హీరో మంచు మనోజ్‌ కారుకు జరిమానా

by Disha Web |
హీరో మంచు మనోజ్‌ కారుకు జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో గత కొన్ని రోజులుగా బ్లాక్ ఫిలింతో ప్రయాణిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెహిదీపట్నం టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే అటుగా వెళ్తున్న హీరో మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు. అంతేకాకుండా మనోజ్‌‌కు సంబంధించిన AP 39HY 0319 గల కారుకు రూ. 700 జరిమానా కూడా విధించారు.



Next Story

Most Viewed