సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్ - విజయవాడ హైవే

by Gantepaka Srikanth |

సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరంలో స్థిరపడిన జనాలంతా మెల్లగా ఊరి బాట పడుతున్నారు.

సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్ - విజయవాడ హైవే
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranti Festival) సమీపిస్తుండటంతో నగరంలో స్థిరపడిన జనాలంతా మెల్లగా ఊరి బాట పడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా(Pantangi Toll Plaza) వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. రేపటి నుండి పండుగ సెలవులు రావడంతో.. పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండటం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్(Heavy Traffic) ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. టోల్ ప్లాజా అధికారులు టోల్ గేట్‌ల సంఖ్యను ఆరు నుండి ఎనిమిదికి పెంచినప్పటికీ వాహనాలు రద్దీ పెరుగుతూ వస్తుంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు, టోల్‌ ప్లాజా సిబ్బందికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాహనాలు వేల సంఖ్యలో వస్తుండటంతో అధికారులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.

Next Story