- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాను గడ్డ కట్టిస్తున్న భారీ హిమపాతం.. ఏడుగురు మృతి, 17,000 విమాన సర్వీసులు రద్దు
గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న మంచు తుఫాను.. అమెరికాను అతలాకుతలం చేస్తుంది. గత వారం రోజులుగా భారీ హిమపాతం జరిగి ఆ దేశాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేసింది.

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న మంచు తుఫాను (snow storm).. అమెరికాను అతలాకుతలం చేస్తుంది. గత వారం రోజులుగా భారీ హిమపాతం (Heavy snowfall) జరిగి ఆ దేశాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేసింది. మిడ్-అట్లాంటిక్, దక్షిణ ప్రాంతాల్లో వీస్తున్న శీతల గాలులు, కురుస్తున్న భారీ మంచు కారణంగా సుమారు 19 కోట్ల మంది ప్రజలు వింటర్ వెదర్ వార్నింగ్ కింద ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విపరీతమైన చలి కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లూసియానా, టెక్సాస్‌లో హైపోథెర్మియా వల్ల కొందరు చనిపోగా, న్యూయార్క్ సిటీలో గడ్డకట్టే చలికి గురై మరికొందరు మరణించారు. దాదాపు 10 లక్షల మందికి పైగా వినియోగదారులు విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతున్నారు.
భారీ హిమపాతం కారణంగా అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 17,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ స్థాయిలో విమానాలు రద్దు కావడం ఇదే మొదటిసారి. బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో గత కొన్నేళ్లలో చూడని విధంగా భారీగా మంచు కురుస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన అధ్యక్షుడు ట్రంప్ 12 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని (Emergency Declarations) ప్రకటించారు. నష్‌విల్లే, మిస్సిసిపీ వంటి ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మరో కొన్ని రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.






