- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో భారీ వర్షం
నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్న తరుణంలో, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్న తరుణంలో, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. దీని ప్రభావంతో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. రాబోయే మరికొద్ది గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ నిపుణులు భారీ వర్ష సూచన జారీ చేశారు. రాబోయే గంటల్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, హనుమకొండ, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు ఏపీలోని పలు జిల్లాలకు తక్షణ ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో మరో రెండు గంటల వ్యవధిలోనే తీవ్రమైన ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల రాకతో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, వర్షం కురిసే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






