హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ వర్షం

by Muthe.Rajitha |   (  Updated:2026-05-26 19:04:18  IST  )

హైదరాబాద్ నగరవాసులకు తీవ్ర ఎండల నుంచి ఉపశమనం లభించేలా మంగళవారం అర్థరాత్రి నగరాన్ని భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.

హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరవాసులకు తీవ్ర ఎండల నుంచి ఉపశమనం లభించేలా మంగళవారం అర్థరాత్రి నగరాన్ని భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది. తూర్పు హైదరాబాద్ పరిధిలోని కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ (OU) మీదుగా ఎల్బీ నగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కాగా, ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరికను జారీ చేసింది. మేడ్చల్, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బాచుపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీవ్రమైన ఉరుములు, మెరుపులు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయడంతో పాటు, పిడుగులు పడే అవకాశం ఉందని HMD అధికారులు హెచ్చరించారు. మరికొద్ది గంటల్లో నగరంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాలకు వర్షం విస్తరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా మధ్యాహ్నానికి రాత్రికి ఒక్కసారిగా వాతావరణం మారిపోగా.. చల్లని వాతావరణాన్ని నగర వాసులు ఎంజాయ్ చేస్తున్నారు.

Next Story