తాండూరులో భారీ వర్షం.. పొంగిపొర్లిన మురుగు కాలువలు

by Batti.Sumithra |

తాండూరు నియోజకవర్గంలో శనివారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

తాండూరులో భారీ వర్షం.. పొంగిపొర్లిన మురుగు కాలువలు
X

దిశ, తాండూరు : తాండూరు నియోజకవర్గంలో శనివారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. తాండూరు పట్టణంలో గంటపాటు కురిసిన వర్షంతో మురుగు కాలువలు పొంగిపోర్లాయి. రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుకున్నాయి. మరోవైపు భారీ వర్షం వల్ల పట్టణంలోని డీసీఎంఎస్ కేంద్రంలో రైతులు నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. బస్తాల పై ప్లాస్టిక్ కవర్లు, తాడిపత్రిలు కప్పినా లాభం లేకుండా పోయింది. వర్షపు నీరంతా ధాన్యం బస్తాల కిందికి వెళ్లి బస్తాలు తడిసి పోయాయి. దీంతో పాటు భారీ వర్షంతో పాటు గాలి దుమారం వల్ల హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో వేప చెట్టు విరిగిపడింది. అంతారం తాండ భూకైలాస్ మార్గంలో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. ఆ మార్గంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Next Story