Heavy rain: ఈ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం

by Malleboina Mahesh |

"తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు! అనకాపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వాన. రాబోయే 24 గంటల్లో మరిన్ని జిల్లాలకు విస్తరిస్తుందని వాతావరణ శాఖ అలర్ట్."

Heavy rain: ఈ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం తర్వాత వర్షాలు (rains) కురుస్తున్నాయి. ఏపీలోని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోనూ భారీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై చెదురుమదురు వానలు పడుతున్నట్లు సమాచారం అందుతోంది.

అల్పపీడన ద్రోణి కారణంగా రాబోయే 24 గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ అకాల వర్షాల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story