- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో భారీ ఉరుములతో దంచికొడుతున్న వర్షం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, అల్వాల్, సుచిత్ర, గచ్చిబౌలి, మాదాపూర్, ఎస్సార్ నగర్, ఫిల్మ్ నగర్, హైదర్ నగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, తార్నాక, విద్యానగర్, హిమాయత్‌నగర్ వంటి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాన తీవ్రంగా కురుస్తోంది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమై పలుచోట వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఈ వర్షం రాత్రి 8 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో ముంపు ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి (GHMC) అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని క్లియర్ చేయడానికి, అలాగే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి హైడ్రా (HYDRAA) బృందాలతో పాటు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.






