- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భానుడి భగభగలు.. ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. కేవలం ఒంటిమిట్టలోనే కాకుండా, నంద్యాల జిల్లా సంజామలలో 44.2°C, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 262 మండలాల్లో 40°Cకి పైగా ఉష్ణోగ్రతలు రికార్డవడంతో, రాయలసీమ ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
వడగాలుల బీభత్సం..
ఈ ఏప్రిల్ మాసంలో సాధారణం కంటే 2-3°C అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల్లో ఎండలు మధ్యాహ్నం 11 గంటల నుంచే దంచి కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.






