8 సింహాల మృతి కేసు.. కారణం ఇదేనన్న మంత్రి

by Muthe.Rajitha |   (  Updated:2026-06-07 12:47:48  IST  )

ఇటీవల గుజరాత్ లోని గిర్ ఫారెస్టులో 8 సింహల మృతికి వడదెబ్బే కారణం అని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి అర్జున్ తెలిపారు.

8 సింహాల మృతి కేసు.. కారణం ఇదేనన్న మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఇటీవల 8 ఆసియా సింహాలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సింహాలు చనిపోవడానికి ఎటువంటి అంటువ్యాధి కారణం కాదని, విపరీతమైన ఎండల వల్ల వడదెబ్బ, అలాగే రోగనిరోధక శక్తి తగ్గడమే ప్రధాన కారణమని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అర్జున్ మోద్వాడియా స్పష్టం చేశారు. కాగా సోమనాథ్, అమ్రేలి జిల్లాల పరిధిలోని గిర్ అటవీ ప్రాంతంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ఎనిమిది సింహం పిల్లలు మరణించాయి. వన్యప్రాణులలో సాధారణంగా కనిపించే 'బాబేసియా' (Babesia) అనే వ్యాధి వల్ల ఇవి చనిపోయి ఉండవచ్చని మొదట భావించారు. అయితే, గాంధీనగర్‌లోని గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో జరిపిన పరీక్షల్లో ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులు లేవని తేలింది. కేవలం తీవ్రమైన ఎండలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే అవి చనిపోయాయని మంత్రి తెలిపారు.

సింహాల మరణాల తర్వాత అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలోని సింహాలను ప్రత్యేక నిఘాలో ఉంచారు. తీవ్ర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న 17 సింహాలను క్వారంటైన్‌లో ఉంచి ప్రత్యేక చికిత్స అందించారు. వాటిలో పూర్తిగా కోలుకున్న 12 సింహాలను ఇప్పటికే తిరిగి అడవిలోకి వదిలిపెట్టారు. మిగిలిన 5 సింహాలు కూడా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా సహజ సిద్ధమైన అటవీ వాతావరణంలోకి విడుదల చేస్తామని మంత్రి వివరించారు.

VIRAL: కిలో బెండకాయలు రూ.7,200..! ధర చూసి భారతీయుడి మైండ్‌బ్లాంక్



Next Story