పుల్లటి ఈ ఆకుకూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!!

by Kodari Anjali |

గోంగూర (Cucumber) ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

పుల్లటి ఈ ఆకుకూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: గోంగూర (Cucumber) ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పుల్లటి గోంగూరలో దట్టమైన పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గోంగూరతో చేసే పప్పు , పచ్చడి, గోంగూర రైస్ వంటివి తినడం వల్ల కూడా హెల్త్‌కు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే గోంగూరలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హైబీపి తగ్గించడంలో సహాయపడుతుంది.

గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 6, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. పుల్లటి గోంగూరలోని పోషకాలు ఎముకలను స్ట్రాంగ్ చేస్తాయి. గోంగూరలోని పోషకాలు కళ్లకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి.

కాగా రెగ్యులర్‌గా గోంగూర తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకునేలా చేయ‌డంలో గొంగూర ఎంతో మేలు చేస్తుంది. గోంగూరలోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా అదుపులో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

గోంగూరను వారంలో రెండు, మూడు సార్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోంగూర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం కూడా తొందరగా జీర్ణం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడే వారు గోంగూర తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోంగూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ దట్టంగా ఉంటాయి. కాగా ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తోడ్పడుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ఆయాసం, దగ్గు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పితో బాధపడుతారు. కాగా ఈ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా హైబీపీని తగ్గిస్తుంది. విరిగిన ఎముకల్ని తొందరగా అతుక్కుపోయేలా చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అదుపులో ఉంచుతుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story