ఈదురు గాలుల బీభత్సం.. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, చెట్లు

by Jakkula.Mamatha |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

ఈదురు గాలుల బీభత్సం.. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, చెట్లు
X

దిశ,గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పదుల సంఖ్యలో రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయని సమాచారం. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంభీరావుపేట నుంచి నర్మల, లింగన్నపేట వెళ్లే దారిలో వృక్షాలు పడడంతో ప్రయాణికులకు అంతరాయం కలిగింది. ఎస్సై శ్రీకాంత్ స్పందించి జెసిబి సహాయంతో చెట్లను రోడ్డుపై నుంచి క్లియర్ చేశాడు.

Next Story