- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం.. కుండబద్దలు కొట్టిన హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు మరోసారి ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు మరోసారి ఆరోపణలు చేశారు. శుక్రవారం కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు కుంభకోణంతో పాటు రాష్ట్రంలో ఇంకో స్కామ్ కూడా జరిగిందని ఆరోపించారు. అదే సోలార్ స్కామ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 127 మెగావాట్ల సోలార్ స్కామ్ జరిగిందని అన్నారు. సోలార్ ప్లాంట్స్‌కి కూడా సైట్ విజిట్ నిబంధన పెట్టారు. రూ.200 నుంచి రూ.250 కోట్లు వచ్చేలా టెండర్లు కట్టబెట్టారు. సోలార్ ప్లాంట్ కోసం దేశమంతా రూ.3 కోట్ల టెండర్ అయితే.. మన రాష్ట్రంలో మాత్రం రూ.5 కోట్ల 4 లక్షలకు టెండర్ ఇచ్చిందని హరీష్ రావు మండిపడ్డారు.
మీడియాకు హరీష్ రావు వార్నింగ్
‘మీడియా ఛానళ్ళు అడ్డగోలుగా రాస్తున్న లీక్ వార్తలు ఆపాలి. మీకు లోపల జరుగుతున్న విచారణ గురించి ఎవరు లీక్ ఇస్తున్నారు?. లోపల జరగని దాన్ని నిజం అన్నట్లు బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు. లీకులు ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మొన్న నేను విచారణకు పోయినప్పుడు అన్నీ అబద్ధాలు ప్రచారం చేశారు. మాకు మీడియాతో మంచిగా ఉండటం అలవాటు. మీడియా సంస్థల మీద పరువు నష్టం వేయలేక కాదు. మీడియాతో మంచి రిలేషన్ మైంటైన్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి లీకుల ప్రచారంలో ఆలోచించుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం’ హరీష్ రావు మీడియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.






