విద్యార్థులను కలిసే సమయం లేదా?: హరీష్ రావు

by Gantepaka Srikanth |

సినిమా థియేటర్ ఓపెనింగ్ వెళ్లిన రేవంత్‌రెడ్డికి.. అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ము లేదా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు.

విద్యార్థులను కలిసే సమయం లేదా?: హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినిమా థియేటర్ ఓపెనింగ్ వెళ్లిన రేవంత్‌రెడ్డికి.. అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ము లేదా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు. నాడు ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ముఖం చూపడం లేదని ప్రశ్నించారు. వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య సినిమా థియేటర్ వెళ్లే సమయం ఉన్న సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా? అని నిలదీశారు. సినిమా థియేటర్ పక్కనే అశోక్‌నగర్ లైబ్రరీ ఉన్నదని తెలిపారు. లైబ్రరీకి వెళ్లకుండా తోక ముడుచుకొని పారిపోయారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని.. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వనే లేదని తెలిపారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమని మంత్రి శ్రీధర్‌బాబు ఎలా అంటారని నిలదీశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించారని.. ఇప్పుడు నయవంచన చేశారని ఆరోపించారు.

Next Story