- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు.. తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. అధికారుల ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) మరోసారి తెరమీదకు వచ్చింది. అధికారుల ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao)కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. ఈరోజు (మంగళవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారుల ఎదుట ఆయన హాజరుకానున్నారు. 2024 మార్చిలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా, ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ విచారణ సాగనుంది. ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు తెలిసిన వాస్తవాలు, ఇతర కీలక అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
విచారణ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో రాజకీయ సందడి పెరిగింది. హరీష్ రావు ఈరోజు ఉదయం 9 గంటలకే తెలంగాణ భవన్ (Telangana Bhavan)కు చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ పర్యటన నేపథ్యంలో తెలంగాణ భవన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station) వద్ద పోలీసులు భారీ బందోబస్తు (Heavy security) ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు నేరుగా విచారణకు బయలుదేరనుండటంతో, ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది.
Read More..






