- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన హరీష్ రావు సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao) సిట్ విచారణ ముగిసింది. ఏడు గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. కీలక అంశాలను రికార్డు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. ముఖ్యనేతలతో సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇవాళ ఉదయం విచారణకు హాజరయ్యే ముందు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని తెలిపారు. నేను తప్పు చేయలేదు.. కేవలం బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. ఇది రాజకీయ డ్రామా అని అన్నారు. మేం భయపడం.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసినా సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. నీ అవినీతి కుంభకోణాలు బయటపెడతామని.. తెలంగాణ ప్రజల పక్షాణ ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.






