వారి సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా: హరీష్ రావు ట్వీట్

by Gantepaka Srikanth |

ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

వారి సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా: హరీష్ రావు ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రిటైర్డ్ ఉద్యోగులు అంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రశ్నిస్తే సిట్ చేత నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. గతంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏనాడూ కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. ఆయన దృష్టి మొత్తం పరిపాలన మీదే ఉండేదని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేసి కంపెనీలు, పెట్టుబడులు రాకుడా చేశారని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story