- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామూలుగా కాదు.. సింహాల్లా గర్జిస్తాం: హరీష్ రావు
బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు అని తెలిపారు. రేవంత్ బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే తనకు, కేటీఆర్‌కు నోటీసులు అని పేర్కొన్నారు. ‘రేవంత్ గుర్తుపెట్టుకో.. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం. దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే. మీరు బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. మేం ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి నిన్ను నిలదీస్తున్నాం’ అని స్పష్టం చేశారు. నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమేనని.. ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బీఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా రేవంత్‌ను, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుంభకోణాలను, వాటాల పంచాయితీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారని తెలిపారు.






