‘హరికథ’ ట్రైలర్ విడుదల.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-26 15:32:10  IST  )

రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), శ్రీరామ్, దివి, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి(Ambati Arjun), రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘హరికథ’(Harikatha).

‘హరికథ’ ట్రైలర్ విడుదల.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), శ్రీరామ్, దివి, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి(Ambati Arjun), రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘హరికథ’(Harikatha). దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తుండగా.. మ్యాగీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే డిసెంబర్ 13 నుంచి ‘హరికథ’ వెబ్ సిరీస్(Web series) స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడు తాను మళ్లీ పుడతానని, ధర్మాన్ని స్థాపిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు.. పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి.. ఇలా శ్రీవిష్ణు అవతారాల రూపంలో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి.

ఆ వ్యక్తి ఎవరు ?, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ విచారణలో పోలీస్ ఆఫీసర్ కు ఎదురైన ఘటనలు ఏంటి? అనేది ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. నాటకాల్లో దేవుడి పాత్రలు పోషించే నటుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించగా.. పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్(Shri Ram) నటించారు.

Click For Video ....

Read More...

Mechanic Rocky Twitter Review: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Next Story