Hardik Pandya: ప్రసిద్ధ్ కృష్ణకు క్షమాపణ చెప్పిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్

by Malleboina Mahesh |   (  Updated:2022-04-15 09:42:55  IST  )

దిశ, వెబ్ డెస్క్: వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా

Hardik Pandya: ప్రసిద్ధ్ కృష్ణకు క్షమాపణ చెప్పిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో హార్దిక్.. స్టార్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు క్షమాపణ చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. నిన్న జరిగిన గుజరాత్, రాజస్థాన్ మ్యాచ్ లో 52 బంతుల్లో.. 87 పరుగులు చేసిన పాండ్యా.. చివరి ఓవర్ లో ప్రసిద్ క‌ృష్ణ వేసిన లాస్ట్ బంతికి ఫోర్ కొట్టిన పాండ్యా.. అతనికి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ నవ్వుతూ కనిపించాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం.. సోషల్ మీడియాలో.. తెగ హల్ చెల్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ RR ని 37 పరుగుల తేడాతో ఓడించింది.

Next Story