ఆమెతో పనిచేయడమే పెద్ద తప్పు : స్టార్ డైరెక్టర్

by Dishanational1 |
ఆమెతో పనిచేయడమే పెద్ద తప్పు : స్టార్ డైరెక్టర్
X

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా కంగనా రనౌత్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2017లో కంగనతో 'సిమ్రాన్' సినిమా చేసిన హన్సల్.. ఆమెతో పనిచేయడమే జీవితంలో చేసిన అతి పెద్ద తప్పని చెప్పాడు. తామిద్దరి ప్రయాణమే వివాదాలతో కూడుకున్నదని, తన వ్యవహార శైలిపట్ల ఏ మాత్రం సంతోషంగా లేనని తెలిపాడు. కంగనతో గెలవలేకపోయినప్పటికీ ఎప్పుడూ ఎగతాళి, దూషణ వంటి పనులు చేయలేదని స్పష్టం చేశాడు. అలాగే ఈ చిత్రానికి కంగన దర్శకత్వం వహించడమే కాక ఎడిటింగ్ బాధ్యతలు కూడా తీసుకుందని, అందుకే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే విషయంపైనా ఆయాన క్లారిటీ ఇచ్చాడు. తను ఎడిటింగ్ చేయలేదు కానీ కొన్ని షాట్స్ మాత్రం చిత్రీకరించినట్లు వెల్లడించాడు. నిజానికి తనను నటిగా గొప్ప ప్రతిభావంతురాలని ప్రశంసించిన హన్సల్.. మిగతా విషయాల్లో తన సొంత వ్యక్తిత్వానికే పరిమితమైందని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

Next Story

Most Viewed