Uddhav Thackeray: రాముడు పుట్టకపోతే..బీజేపీ ఏ సమస్య లేవనెత్తేదన్న ఉద్ధవ్ ఠాక్రే

by Malleboina Mahesh |   (  Updated:2022-04-11 05:41:02  IST  )

దిశ, వెబ్ డెస్క్: హిందుత్వంపై తనకే పేటెంట్ ఉన్నట్టు బీజేపీ చెప్పుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి,

Uddhav Thackeray: రాముడు పుట్టకపోతే..బీజేపీ ఏ సమస్య లేవనెత్తేదన్న ఉద్ధవ్  ఠాక్రే
X

దిశ, వెబ్ డెస్క్: హిందుత్వంపై తనకే పేటెంట్ ఉన్నట్టు బీజేపీ చెప్పుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కషాయం తో పాటు హిందుత్వం కూడా కలిస్తేనే కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి దోహదపడుతుందని శివసేన చీఫ్ బాల్ ఠాక్రే బీజేపీ కి మార్గం చూపారని గుర్తు చేశారు. బీజేపీ లాగా భారతీయ జనసంఘ్, జనసంఘం వంటి విభిన్న భావజాలాలను ప్రచారానికి శివసేన పాల్పడలేదని, కాషానికి, హిందుత్వంకు మాత్రమే శివసేన కట్టుబడి ఉండిందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

బీజేపీ హిందుత్వంపై తానొక్కటే పేటెంట్ హక్కును కలిగి లేదని ఉద్ధవ్ చెప్పారు. శ్రీరామచంద్రుడు జన్మించకపోయిఉంటే బీజేపీ రాజకీయాల్లో ఏ సమస్యను లేవనెత్తి ఉండేదని ఉద్ధవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Next Story