జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్.. వంట గిన్నెలతో విద్యార్థుల నిరసన

by Gantepaka Srikanth |

నల్లగొండలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు తినే భోజనంలో గుట్కా ప్యాకెట్ కలకలం రేపింది.

జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్.. వంట గిన్నెలతో విద్యార్థుల నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు తినే భోజనంలో గుట్కా ప్యాకెట్(Gutka Packet) కలకలం రేపింది. మహాత్మ గాంధీ యూనివర్సిటీ(Mahatma Gandhi University)లో ఈ ఘటన చోటుచేసుకుంది. జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్ కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా అన్నంలో క్రిమికీటకాలు వచ్చాయని మండిపడ్డారు. ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా యూనివర్సిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదని.. సోమవారం మధ్యాహ్నం వంట గిన్నెలతో విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. నార్కట్‌ప‌ల్లి పోలీసులు వచ్చినప్పటికీ తమ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని విద్యార్థులు అక్కడే కూర్చున్నారు. యూనివర్సిటీ హాజరు విషయంలో 75 శాతం ఉండాలని నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్న వీసీ, యూనివర్సిటీ విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతుంటే ఎందుకు సమస్యను పరిష్కరించారని ప్ర‌శ్నించారు. విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ వీసీ బెదిరింపు ధోర‌ణితో వ్యవహరిస్తున్నారని ఈ సంద‌ర్భంగా వారు పేర్కొన్నారు. తాజాగా ఈ ఘటనపై మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ స్పందించారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

Next Story