సిబ్బంది నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థిని మృతి

by Muthe.Rajitha |

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విషాద ఘటన జరిగింది.

సిబ్బంది నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థిని మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విషాద ఘటన జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థిని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది. రిపబ్లిక్ డే వేడుకల కోసం ఆటోలో ఫర్నిచర్ తెప్పించిన సిబ్బంది, దాన్ని విద్యార్థులతోనే అన్లోడ్ చేయించారు. ఈ సమయంలో ఆటోలో నుంచి ఫర్నిచర్ దిగుస్తూ సంగీత ఒక్కసారిగా కిందపడిపోయి తీవ్రంగా గాయపడింది. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంగీత మద్నూర్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఈ ఘటన పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయిందని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story