నగరంలో దుండగుల కాల్పులు.. కోఠి ఎస్‌బీఐ కార్యాలయం వద్ద బీభత్సం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-31 03:55:33  IST  )

హైదరాబాద్ మహా నగరంలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి.

నగరంలో దుండగుల కాల్పులు.. కోఠి ఎస్‌బీఐ కార్యాలయం వద్ద బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్/కార్వాన్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. కోఠిలోని ఎస్‌బీఐ (SBI) కార్యాలయం వద్ద కొంతమంది దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులకు తెగబడ్డారు. ఉదయం 7 గంటల ప్రాతంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిషద్ (Rishad) అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఏకంగా రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ దాడిలో రిషద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు సుల్తాన్ బజార్ (Sultal Bazar) పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఎస్‌బీఐ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Next Story