3 కోట్ల 13 లక్షలతో గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Batti.Sumithra |

గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో మూడు కోట్ల 13 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.

3 కోట్ల 13 లక్షలతో గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, జిన్నారం : గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో మూడు కోట్ల 13 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పాలకవర్గంతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా పనిచేసినప్పుడే వారి మన్ననలు పొందుతామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు, స్థానిక పరిశ్రమల సీఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అనంతరం గుమ్మదలలో నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story