- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అట్టహాసంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. ప్రారంభించిన మంత్రులు జూపల్లి, పొన్నం
నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ రంగురంగుల పతంగులు, నోరూరించే మిఠాయిలతో పండుగ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ రంగురంగుల పతంగులు, నోరూరించే మిఠాయిలతో పండుగ వాతావరణం నెలకొంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2026 (Kite and Sweet Festival-2026)ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రారంభించారు. ఈ మేరకు ఫ్రాన్స్ దేశానికి చెందిన షార్క్ ఆకారంలో ఉన్న కైట్‌ను మంత్రి జూపల్లి ఎగురవేసి సందడి చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అమెరికా, ఫ్రాన్స్, ఇండోనేషియా, మలేషియా సహా సుమారు 19 దేశాల నుంచి 40 మందికి పైగా అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటున్నారు. వారితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 55 మంది ప్రొఫెషనల్ ఫ్లైయర్స్ తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు.
1,300లకు పైగా సంప్రదాయ వంటల స్టాళ్లలో
ఇక గృహిణులు, వివిధ రాష్ట్రాల అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీట్ ఫెస్టివల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 1,300లకు పైగా స్టాళ్లలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు పంజాబ్, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల స్వదేశీ మిఠాయిలు అందుబాటులో ఉన్నాయి. పగటి పూట రంగురంగుల గాలిపటాలతో నిండిపోయే ఆకాశం, రాత్రి వేళల్లో ఎల్‌ఈడీ (LED) పతంగుల వెలుగులతో మెరిసిపోనుంది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) సంస్కృతిని, హైదరాబాద్ (Hyderabad) బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటిచెప్పేందుకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు. విదేశీ అతిథులకు మన రాష్ట్ర ఆతిథ్యం తెలిసేలా అన్ని ఏర్పాట్లు చేశాం. సందర్శకులకు ఎంట్రీ ఫ్రీగా కల్పించామనని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే ఆనందం, ఉత్సాహం అని, ఇలాంటి వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని అన్నారు. నగర ప్రజలంతా తమ కుటుంబాలతో కలిసి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు రావాలని విజ్ఞప్తి చేశారు.






