ఈనెల 22 నుంచి 26 వరకు గ్రాండ్ నర్సరీ మేళా..

by Kema Shiva Kumar |

గ్రేటర్ నగరంలో ఈనెల 22 నుంచి 26 వరకు ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు

ఈనెల 22 నుంచి 26 వరకు గ్రాండ్ నర్సరీ మేళా..
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ నగరంలో ఈనెల 22 నుంచి 26 వరకు ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంగళవారం ‘19వ గ్రాండ్‌ నర్సరీ మేళా’ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న మహానగరాల్లో పచ్చదనం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నర్సరీ మేళా ఇంచార్జీ ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన నర్సరీ ఉత్పత్తులతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి సరికొత్త పద్ధతులను ఈ షోలో ప్రదర్శిస్తామన్నారు. ఈ మేళా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మొక్కలతో సుమారు 120 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెడిసినల్, కిచెన్, అవుట్ డోర్, బల్బ్స్, సీడ్స్, సీడ్లింగ్స్, ఇండోర్, అడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్ మరియు ఇంపోర్టెడ్ ప్లాంట్స్‌ను ఇక్కడ ప్రదర్శించనున్నారు. రాష్ట్ర మంత్రులు, హార్టీకల్చర్ ఉన్నతాధికారులు ఈ మేళాను ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.

Next Story