వైభవంగా కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

by Ratna Kumari |

శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీశ్రీ కట్టమైసమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు బొడ్రాయి, నాభిశిలా ప్రతిష్ఠా మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు.

వైభవంగా కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
X

దిశ, శంషాబాద్: శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీశ్రీ కట్టమైసమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు బొడ్రాయి, నాభిశిలా ప్రతిష్ఠా మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు ప్రశాంతతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయాలని అన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సాంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story