- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు ఘన సన్మానం
జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుళ్లు వెంకటరమణయ్య, మహబూబ్ అలీకి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుళ్లు వెంకటరమణయ్య, మహబూబ్ అలీకి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. డీసీఆర్‌బీలో విధులు నిర్వహించిన వెంకటరమణయ్య, కొనరావుపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన మహబూబ్ అలీని అదనపు ఎస్పీ చంద్రయ్య పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇద్దరు అధికారులు పోలీస్ శాఖలో అంకితభావంతో, నిజాయితీగా విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. వారి సేవలు శాఖకు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ ఉద్యోగానికే పరిమితమని, వారి అనుభవం సమాజానికి ఎప్పటికీ ఉపయోగపడుతుందన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఎలాంటి అవసరం వచ్చినా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి, పదవీ విరమణ పొందిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






