- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేసారి ఐదు కొలువులు.. యువకుడికి ఘన సన్మానం
ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం అంజన్ కుమార్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

దిశ, మంచాల : ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం అంజన్ కుమార్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన చిందం సుగుణమ్మ-కృష్ణయ్యల కుమారుడు అంజన్ కుమార్ ఇటీవల ఒకేసారి ఐదు కొలువులు సాధించిన సందర్భంగా మంగళవారం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అంజన్ కుమార్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్లర్క్, హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్, రెండు రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలతో పాటు టీజీఎస్‌ఆర్‌టీసీ సూపరింటెండెంట్‌గా ఎంపిక కావడం అభినందనీయమని, ఇది మండల పరిధిలోని యువతకు గర్వకారణమని కొనియాడారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుడిమల్ల చంద్రయ్య, మార సురేష్, వస్పరి కుమార్, ఎండీ అష్రఫ్, కోరె పాండు తదితరులు పాల్గొన్నారు.






