రోడ్డు ప్రమాదంలో గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి

by Batti.Sumithra |

రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి
X

దిశ, రఘునాథపల్లి : రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య రోజువారీ పనుల నిమిత్తం రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారైనట్లు సమాచారం. మృతుడు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో గత 20 ఏళ్లుగా ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఎల్లయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని స్థానికులు కోరారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Next Story