- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం.. అడ్డుకున్న జీపీఓ
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 142లోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నించిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

దిశ, ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 142లోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ జీపీవో కోటేశ్వరరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని జరుగుతున్న పనులు నిలిపివేశారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జీపీఓ హెచ్చరించారు.
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం సంఘటన పై సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి, భూమికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.






