దిశ కథనానికి స్పందన.. ఆక్రమణపై కలెక్టర్ సీరియస్

by S Gopi |

దిశ, ఖమ్మం రూరల్: దర్జాగా కబ్జా అనే శీర్షికను శుక్రవారం దిశ దినపత్రిక ప్రచురించిన విషయం పాఠకులకు..Govt land Occupying in Khammam Rural

దిశ కథనానికి స్పందన.. ఆక్రమణపై కలెక్టర్ సీరియస్
X

దిశ, ఖమ్మం రూరల్: దర్జాగా కబ్జా అనే శీర్షికను శుక్రవారం దిశ దినపత్రిక ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు ఐబీ ఈ సమ్మిరెడ్డి, తహశీల్దార్ టి. సుమ ఐబీ డిఈ శాస్త్రి పంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ, సర్వేయర్ వెంకట్రావులు సందర్శించి జాయింట్ సర్వే చేసి సాగర్ కాలువ ఆక్రమణ నిజమే అని తేల్చారు. రెండు రోజుల లోపు కాలువ కాలువ తీసి హద్దులు గుర్తించాలని తహశీల్దార్ ఆదేశించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడం చట్టరీత్యా నేరమని తెలిపారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని ఐబీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ నరేష్ తదితరులు ఉన్నారు.

Next Story