బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌గా దెబాశిష్ పాండా నియామకం!

by Harish |

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ..telugu latest news

బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌గా దెబాశిష్ పాండా నియామకం!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్‌గా మాజీ ఆర్థిక సేవల కార్యదర్శి దెబాశిష్ పాండాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి రాబోయే మూడేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త ఛైర్మన్‌గా ఉండనున్నారని ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దెబాశిష్ పాండా ఈ ఏడాది జనవరి ఆఖరు వరకు కేంద్ర ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా వ్యవహరించారు. దెబాశిష్ పాండ్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత ఏడాది మేలో సుభాష్ చంద్ర పదవీకాలం పూర్తికావడంతో సంస్థ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది.

Next Story