- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదు: సీపీఐ నారాయణ
లొంగిపోయిన మావోయిస్టుల పట్ల ప్రభుత్వ వేధింపులు సరికావన్న సీపీఐ నారాయణ. సరెండర్ అయిన వారికి స్వేచ్ఛ లేదని, వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విమర్శ.

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టుల పట్ల భారత ప్రభుత్వ తీరు సరికాదు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నక్సల్ రహితంగా ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టుల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరెండర్ అయిన వారికి కనీస స్వేచ్ఛ లేదని, వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం సరికాదని ఆయన విమర్శించారు. అడవిలో ఉన్నప్పుడు ఆకులు తిని అయినా ఆత్మగౌరవంతో బతికేవారని, కానీ ఇప్పుడు జనజీవన స్రవంతి లోకి వచ్చిన వారు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి చేరుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులను హింసించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అలాగే లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సరైన భరోసా ఇవ్వడం లేదని, వారి హక్కులను కాలరాస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు. ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న, లొంగిపోయిన క్రాంతికారులకు సీపీఐ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వారిని మానసికంగా కుంగదీయకుండా, సమాజంలో గౌరవంగా బతికేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు.






