- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోస్టర్ విధానం రద్దు చేసే వరకు ప్రభుత్వ నోటిఫికేషన్లు నిలిపి వేయాలి:BMI రాష్ట్ర అధ్యక్షులు
అశాస్త్రీయమైన రోస్టర్ విధానం రద్దు చేసే వరకు ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ, విద్య, ప్రమోషన్ల నోటిఫికేషన్లు వెంటనే నిలిపివేయాలని భీమ్ మిషన్ ఐడియాలజీ (BMI) రాష్ట్ర అధ్యక్షులు దామల్ల సర్వయ్య డిమాండ్ చేశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: అశాస్త్రీయమైన రోస్టర్ విధానం రద్దు చేసే వరకు ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ, విద్య, ప్రమోషన్ల నోటిఫికేషన్లు వెంటనే నిలిపివేయాలని భీమ్ మిషన్ ఐడియాలజీ (BMI) రాష్ట్ర అధ్యక్షులు దామల్ల సర్వయ్య డిమాండ్ చేశారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్‌లో భీమ్ మిషన్ ఐడియాలజీ(BMI) హనుమకొండ జిల్లా కన్వీనర్ దండు మోహన్ అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ, రోస్టర్ విధానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలలు చేసిన కృషికి కృతజ్ఞత మరిచి పోయి, రోస్టర్ విధానంతో తడిగుడ్డతో మాలల గొంతు కోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీనీ భూ స్థాపితం చేయాలని కంకణం కట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేశారని మండిపడ్డారు. రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ తంబళ్ల చిట్టి బాబు మాట్లాడుతూ.. ఆర్టికల్ 341(2) ప్రకారం షెడ్యూల్డ్ కులాలను చేర్పులు మార్పులు చేసే అధికారం పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే అధికారం ఉంటుందన్నారు. రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య మాట్లాడుతూ రోస్టర్ పేరుతో మాలలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు కంకణాల సంతోష్ మాట్లాడుతూ.. భిక్షమెత్తుకుంటే హక్కులు పొందలేదని, పోరాడి హక్కులు సాధించుకోవాలన్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని అవసరమైతే మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పుచ్చ లక్ష్మీనారాయణ,వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కునమల్ల అనురాధ, కేయూ డిపార్ట్మెంట్ ఆఫ్ జూయలాజీ హెడ్ ప్రొఫెసర్ వై.వెంకయ్య, హన్మకొండ బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ కొత్త రవి, రిటైర్డ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూరాకుల భారతి, డాక్టర్ శేషగిరి, రిటైర్డ్ ఎస్ఈ ముడిదెల శంకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ బండి అశోక్, మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షులు మన్నె బాబూరావు, మాల జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్, మాల సంఘాల జేఏసీ కన్వీనర్ పోనుగంటి లక్ష్మీనారాయణ, సురాశి విక్రమ్, జిల్లా నాయకులు అంకేశ్వారపు రామచందర్, పనికల శ్రీనివాస్, దండ్రి సదానందం, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.






